News March 21, 2024
రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 28, 2025
KNR: మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ ఆడిటోరియంలో కలెక్టర్ పమెల సత్పతి ఆధ్వర్యంలో మొత్తం 94 మద్యం దుకాణాలకు గాను గీత కార్మికులకు 17, ఎస్సీలకు 9 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. సెప్టెంబర్ 26న టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టి దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23 వరకు స్వీకరించారు. మొత్తం 2,730 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 01 నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.
News October 27, 2025
KNR: ఎస్‌యూ స్నాతకోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం

శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ) ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్, నవంబర్ 7న జరగనున్న రెండవ స్నాతకోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కులపతి, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు అందజేశారు. స్నాతకోత్సవ ఏర్పాట్ల పనులు దాదాపు పూర్తవుతున్నాయని ఆయన గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు.
News October 27, 2025
కరీంనగర్: మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.


