News October 26, 2024
రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యం: ఐటీడీఏ పీవో

2024-25 ఆర్థిక సంవత్సరంలో చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లు కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్దేశించామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. శుక్రవారం కాఫీ అధికారులు, జీసీసీ అధికారులతో కాఫీ సేకరణపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలానికి నిర్దేశించిన మేరకు, కాఫీ పళ్లను సేకరించాలని కాఫీ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కాఫీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
Similar News
News December 10, 2025
ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News December 10, 2025
విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.
News December 10, 2025
14న విశాఖ తీరంలో నేవీ మారథాన్

విశాఖలో ఈనెల 14న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ నేవీ మారథాన్ జరగనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆర్కేబీచ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 17,500 మంది పాల్గొంటున్నారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు కొనసాగుతుంది. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


