News October 26, 2024

రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యం: ఐటీడీఏ పీవో

image

2024-25 ఆర్థిక సంవత్సరంలో చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లు కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్దేశించామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. శుక్రవారం కాఫీ అధికారులు, జీసీసీ అధికారులతో కాఫీ సేకరణపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలానికి నిర్దేశించిన మేరకు, కాఫీ పళ్లను సేకరించాలని కాఫీ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కాఫీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Similar News

News November 15, 2024

ఏయూ: ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు భాగం అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసి ఏయూ వెబ్ సైట్‌లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 14, 2024

ఏయూ: రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఎంటెక్, ఎంప్లానింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. విద్యార్థులు ఏయూ వెబ్ సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ (హాల్ టికెట్) నెంబర్ ఉపయోగించి పరీక్షా ఫలితాలను పొందవచ్చును.

News November 14, 2024

టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో కేకే రాజు, భాగ్యలక్ష్మికి చోటు

image

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా రాష్ట్రం అంతటా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లాకు భాగ్యలక్ష్మి, కెకె రాజులను టాస్క్‌ఫోర్స్‌ కమిటీగా నిర్ణయించింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా వీరు పని చేస్తారు. జిల్లాల్లో పార్టీ నేతలు, లీగల్‌సెల్‌ ప్రతినిధుల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుంది.