News October 3, 2024

రెండో రోజు కొనసాగిన విశాఖ ఉక్కు రక్షణ రిలే దీక్షలు

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర కార్మిక సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాలు, రైతు సంఘాల రాష్ట్ర సమితి పిలుపు మేరకు కర్నూలు ధర్నా చౌక్‌లో రెండో రోజు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐయూటీసీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్ బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ మాట్లాడారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Similar News

News October 3, 2024

నంద్యాల హత్య కేసులో ముద్దాయి అరెస్టు

image

నంద్యాల గుడిపాటిగడ్డ వీధిలో గత నెల 30న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాయి మనోహర్‌ను హత్య చేసిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. తన భార్యతో అక్రమ సంబంధం ఉందని మనోహర్‌తో దుర్గా ప్రసాద్ గొడవ పెట్టుకొని కత్తితో దాడి చేశాడన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మరణించాడన్నారు. పరారీలో ఉన్న దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.

News October 3, 2024

కర్నూలు: CM హామీ.. రూ.లక్ష చెక్కు అందజేసిన కలెక్టర్

image

పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమడ పర్యటన సందర్భంగా మంగళవారం CM చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కవిత భర్త రాముడు వైద్య చికిత్స నిమిత్తం CM రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్కును బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పీ.రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు అందజేశారు. కవిత కుటుంబ సభ్యులు CM చంద్రబాబు, కలెక్టర్‌ రంజిత్ బాషా, MLA శ్యామ్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News October 2, 2024

కర్నూలు: 24 గంటల్లో మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

image

పత్తికొండ మండలం పుచ్చకాయలమడకు చెందిన అశోక్ అనే నిరుద్యోగి తనకు ఆటో ఇప్పించాలని నిన్న సీఎం చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. సీఎం హామీ మేరకు బుధవారం అశోక్‌కు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కలెక్టర్ రంజిత్ బాషా ఆటో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు.