News December 31, 2024

రెండో రోజు 197 మంది అభ్యర్థుల ఎంపిక

image

కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ బెటాలియన్లో జరిగిన రెండో రోజు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు 197 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఏదైనా సమస్యలపై, ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి 28న హాజరు కాగలరని తెలిపారు.

Similar News

News October 15, 2025

ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ పోస్టర్లను ప్రారంభించిన మంత్రులు

image

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలులో బుధవారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(APIIC) నిర్వహించిన ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

News October 15, 2025

పీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు: సీఎం

image

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు కమాండ్ కంట్రోల్ నుంచి కలెక్టర్ సిరి, పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీరపాండ్యన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద భద్రత, పార్కింగ్, నీటి సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించారు.

News October 15, 2025

ప్రధాని పర్యటన సాఫీగా నిర్వహించాలి: డీజీపీ

image

ప్రధాని మోదీ పర్యటన సాఫీగా నిర్వహించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్త పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.