News April 2, 2025

రెండో విడత రీ-సర్వే పనులు పూర్తికి కృషి: కలెక్టర్

image

విజయవాడ సీసీఎల్ కార్యాలయం నుంచి బుధవారం రెవెన్యూ సదస్సుల పీజీఆర్ఎస్ రీ సర్వే ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తదితర అంశాలపై అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు సీసీఎల్ఏ నక్కల ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఫ్రీ హోల్డ్ రెండో విడత రీ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News April 10, 2025

గుంతకల్లు: రైల్వే అభివృద్ధి పనులపై సమీక్ష

image

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ఎస్ఆర్‌సి కమిటీ సభ్యులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని హనుమాన్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జి, కసాపురం రోడ్డులోని రైల్వే బ్రిడ్జి ఎత్తు పెంచే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే తెలిపారు.

News April 10, 2025

PGRS పిటిషన్‌లు పరిశీలించాలి: కలెక్టర్ 

image

PGRS పిటిషన్‌లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ సెక్టర్, రీసర్వే, తదితర అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, తదితరులతో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News April 9, 2025

అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. యువకుడికి అధికారుల షాక్

image

అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడికి అధికారులు షాక్ ఇచ్చారు. గోరంట్ల మండలంలోని గుమ్మయ్యగారి పల్లికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు యువతులు మైనర్లు కావడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పెళ్లిని నిలుపుదల చేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు స్టేషన్‌లో సీఐ శేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.

error: Content is protected !!