News April 12, 2024

రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు: ఎస్పీ

image

రాజకీయంగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన ఉయ్యూరు మహేశ్, వైసీపీకి చెందిన ఆరేపల్లి శ్రీకాంత్ పై వణుకూరు వీఆర్వో వెంకటేశ్వరరావు ఆధారాలతో సహా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పెనమలూరు ఎస్సై ఉషారాణి తెలిపారు.

Similar News

News October 26, 2025

కృష్ణా: తుఫాన్‌ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

image

తుఫాన్‌ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

News October 26, 2025

కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

image

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 26, 2025

‘మొంథా’ తుఫాన్.. జిల్లాలో కంట్రోల్ విభాగాల ఏర్పాటు

image

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. తుఫాన్ సంబంధిత సమాచారం లేదా సహాయక చర్యల కోసం ప్రజలు ఈ కింది నంబర్‌లను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం 08672-252572, MTM RDO 08672-252486, గుడివాడ 08674-243693, ఉయ్యూరు 08676-232589, ఈ కంట్రోల్ రూములు నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ చెప్పారు.