News April 12, 2024
రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు: ఎస్పీ

రాజకీయంగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన ఉయ్యూరు మహేశ్, వైసీపీకి చెందిన ఆరేపల్లి శ్రీకాంత్ పై వణుకూరు వీఆర్వో వెంకటేశ్వరరావు ఆధారాలతో సహా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పెనమలూరు ఎస్సై ఉషారాణి తెలిపారు.
Similar News
News April 10, 2026
పెడనలో మట్టి మాఫియా బరితెగింపు!

పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను ప్రాంతాల నుంచి అక్రమంగా తవ్విన మట్టి ఏకంగా జిల్లాలు దాటుతోంది. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంకేపూడి-ఈదుముడి కనెక్టింగ్ బ్రిడ్జిపై నిత్యం వందలాది లారీలు తిరుగుతుండడంతో ఆ వంతెన బలహీనపడి కూలిపోయే స్థితికి చేరుకుంది.
News April 10, 2026
రక్తదానం ప్రాణదానంతో సమానమనం: కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నంలో ‘సర్వే డే’ పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.
News April 10, 2026
కృష్ణా: ఆలయ భూముల్లో అక్రమ మైనింగ్..!

కృష్ణాజిల్లాలో మరోసారి దేవాలయ భూములపై వివాదం రేకెత్తింది. మచిలీపట్నం బచ్చుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పెడన(M) కొంకెపూడి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయానికి చెందిన సుమారు 4 ఎకరాల భూమిలో నల్ల మట్టిని భారీగా తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.900కు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


