News June 21, 2024
రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప.. ఉద్యోగాల చర్చ లేదు: జగ్గారెడ్డి
బీజేపీ, మంత్రులకు రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే ఉద్యోగుల చర్చ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేరికల అంశం తన పరిధిలో లేదని తెలిపారు.
Similar News
News September 12, 2024
అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నేత సీతారాం ఏచూరి: మంత్రి పొన్నం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అకాల మరణం తనని తీవ్ర ధ్రిగ్బాంతికి గురిచేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సీతారాం ఏచూరి కింది స్థాయి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడు అని, ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాల్లో పోరాడారని గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
News September 12, 2024
తొగుట: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తొగుట మండలం కన్గల్ గ్రామం చెందిన దొమ్మాట స్వామి(30) రైతు మూడెకరాల భూమి కౌలుకు తీసుకున్నారు. పంట పెట్టుబడితో పాటు సుమారు రూ.8 లక్షలు అప్పు అవ్వగా అప్పు తీర్చే మార్గం లేక పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 12, 2024
గణేశ్ నిమజ్జనం: MDKలో ‘రేపటి కోసం’
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం మెదక్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.