News March 13, 2025
రెడ్డిగూడెం: గేదెలను తప్పించబోయి ప్రమాదం

రెడ్డిగూడెంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అన్నేరావుపేట తండాకు చెందిన కూలీలు పనికి వెళ్లి తిరిగి వస్తుండగా రాయుడుపాలెం వద్ద గేదలను తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కుమారి (30) మృతి చెందగా మరో ఇద్దిరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 26, 2025
నేను BRSలోనే ఉన్నా: గద్వాల MLA

తాను BRS MLAగానే ఉన్నానని గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. కొంత మంది కావాలని తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులను అనుసరించి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై FEB 11న PSలో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను BRS సభ్యత్వాన్ని వదులుకోలేదని, పిటిషన్ కొట్టివేయాలని కోరారు. BRSలోనే ఉన్నానని KTRకు చెప్పానన్నారు.
News March 26, 2025
గుంటూరు: రాష్ట్ర జీఎస్టీ స్పెషల్ కమిషనర్‌గా నూతలపాటి సౌమ్య

గుంటూరులోని కస్టమ్స్, జీఎస్టీ అప్పీల్స్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న నూతలపాటి సౌమ్య, రాష్ట్ర జీఎస్టీ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులయ్యారు. మంగళవారం స్టేట్ ట్యాక్సెస్ (జీఎస్టీ) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన సౌమ్య సీనియర్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక హోదాతో ఆమె మూడేళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ శాఖలో పనిచేస్తారు.
News March 26, 2025
భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్‌ను గోషామహల్ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.