News March 28, 2025
రెబ్బెన: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు

రెబ్బెన మండలంలోని పైలెట్ గ్రామపంచాయతీగా ఎంపిక చేసిన పాసిగంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగినట్లుగా బీజేపీ మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ శంకరమ్మకు వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అర్హులందరికీ న్యాయం జరగకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
Similar News
News November 17, 2025
భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్‌లో HR మేనేజర్‌గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ వర్క్‌ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్‌లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.
News November 17, 2025
యాదాద్రి: గ్రామ గ్రామాల్లో లక్ష్మీ నరసింహ కళ్యాణం: ఈవో

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుల కల్యాణం విదేశాల్లో తగ్గించి మారుమూల గ్రామాల్లోనూ నిర్వహిస్తామని దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు చెప్పారు. కొండపైన అధికారులు, అర్చక బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామీణుల అభ్యర్థన మేరకు స్వామి కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రచార రథాలను తక్షణమే అందుబాటులో తెస్తామన్నారు. గోశాలలో దామోదర కళ్యాణం సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <


