News February 24, 2025

రెబ్బెన: పుష్పవతి కావడం లేదని యువతి SUICIDE

image

పుష్పవతి కావడం లేదని మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) పుష్పవతి కావడం లేదని మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

Similar News

News December 10, 2025

HYD: అటూ ఇటూ కాకుండా పోయాం సారూ..!

image

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించాక మహా GHMCగా మారింది. అయితే.. విలీన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాల్టీలకు కాకుండా, GHMC హెల్ప్‌లైన్, ఆన్‌లైన్‌లో తమ వినతులకు స్పందనరాక అటూ ఇటూ కాకుండా పోయామని వాపోతున్నారు. ఇది శాఖలు, అధికార బదీలలపై సమన్వయ లోపమా అని నిలదీస్తున్నారు. తమ మేలుకోసమే జరిగిందనే ఈ విలీనంలో ఇబ్బందులు తెలత్తకుండా చూడాలని కోరుతున్నారు.

News December 10, 2025

ఏలూరులో AI ల్యాబ్‌లు: MP

image

ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు MP పుట్టా మహేశ్ కుమార్ చర్యలు చేపట్టారు. ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటు ఖర్చు సమకూర్చాలని ONGC సంస్థతో మాట్లాడి ఒప్పించినట్లు పేర్కొన్నారు. MP విజ్ఞప్తి మేరకు CSR కింద ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

News December 10, 2025

ఎన్నికల రోజు స్థానిక సెలవు: జిల్లా కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంతో ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో 5 మండలాల పాఠశాలకు సెలవులు ప్రకటించారు.