News April 3, 2025
రెవెన్యూ అధికారుల పనితీరే ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికం: కలెక్టర్

రెవెన్యూ అధికారుల పనితీరే ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాయచోటి పట్టణంలో ఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, వీఆర్వో, వీఆర్ఏలతో రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారు. రెవెన్యూ, సర్వే శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
Similar News
News October 13, 2025
ఎకనామిక్ సైన్సెస్లో ముగ్గురికి నోబెల్

ఎకనామిక్ సైన్సెస్లో జోయెల్ మోకైర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోయిట్ను నోబెల్ ప్రైజ్ వరించింది. ఇన్నోవేషన్ ఆధారిత ఎకనామిక్ గ్రోత్ను వివరించినందుకు గాను వారికి ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్లో మోకైర్కు అర్ధభాగం, అగియోన్, పీటర్కు సంయుక్తంగా మరో అర్ధభాగాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఇప్పటికే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, <<17966688>>పీస్<<>>, లిటరేచర్ అవార్డులు ప్రకటించడం తెలిసిందే.
News October 13, 2025
ప్రజావాణికి 88 ఫిర్యాదులు: NZB అదనపు కలెక్టర్

నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు అందజేశారు.
News October 13, 2025
స్త్రీనిధి రుణ వాయిదా వివరాల పోస్టర్ ఆవిష్కరణ

స్త్రీనిధి రుణ వాయిదా వివరాలు ఉన్న పోస్టర్ను కలెక్టర్ డా.వెంకటేశ్వర్ సోమవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం DRDA అదనపు PD డా.ప్రభావతి మాట్లాడుతూ.. ఈ పోస్టర్లో చూపిన విధంగా స్త్రీనిధి రుణ వాయిదాలను యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో స్త్రీనిధి AGM హేమంత్ కుమార్, LDM రవి కుమార్, స్త్రీనిధి మేనేజర్లు పాల్గొన్నారు.