News February 12, 2026

రెవెన్యూ అర్జీలపై వేగం పెంచాలి: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ విష్ణుచరణ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని, మ్యుటేషన్ దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్, మీ సేవా సేవలను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే ఫేజ్-1, 2, 3 గ్రామాల్లో పనులు పూర్తి చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

SKU నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.

News March 13, 2026

అనంత: ‘బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు’

image

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో ఆస్తి తగాదాల వల్ల 2022లో బాలుడిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.70/2022 u/s 302 r/w 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురికి (చిట్టప్ప, ఈరన్న, ముకుందప్ప) కఠిన జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

News March 13, 2026

భార్యను చంపిన హత్య కేసులో భర్త అరెస్ట్

image

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన శ్రీలేఖ ప్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్‌ను వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భక్త సుధాకర్ శ్రీలేఖను చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పడివేశారన్నారు. సుధాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.