News February 21, 2025
రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్

మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. తహశీల్దార్ యాదిరెడ్డి రికార్డుల వివరాలను అదనపు కలెక్టర్కు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ రికార్డ్ రూమ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం శ్రవణ్, డిప్యూటీ తహశీల్దార్ సంయుక్త, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
సిద్దిపేట: గ్రామం నుంచి జాతీయ స్థాయికి

బహుజన సమాజ్ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి కోఆర్డినేటర్గా ఎన్నికైన బెజ్జంకి మండల వాసి నిషాని రామ చంద్రంను శనివారం బెజ్జంకిలో మానకొండూర్ నియోజకవర్గ నాయకులు పలువురు ఘనంగా సన్మానించారు. బాధ్యతలను అప్పగించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. మాతంగి తిరుపతి, మల్లయ్య, నిషాని రాజమల్లు, సుమలత, గుర్రం సత్యనారాయణ, రాజు, కనకం రఘు పాల్గొన్నారు.
News February 23, 2025
ASF: రైలుపట్టాలపై మృతదేహాలు

MNCL, ASF జిల్లాల్లో రైలు పట్టాలపై మృతదేహాలు లభ్యమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిర్పూర్(టి) సమీపంలో శుక్రవారం ఒక మృతదేహం కనిపించగా.. అంతకుముందు బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో పలు ఘటనలు వెలుగుచూశాయి. కొంతమంది వివిధ కారణాలతో రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు విడుస్తుంటే.. మరికొందరు అనుకోని రీతిలో రైళ్ల కింద పడుతున్నారు. ఇక నెలలో పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అందరినీ కలిచివేస్తోంది.
News February 23, 2025
GWL: మహాశివరాత్రికి స్పేషల్.. శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి 357 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు MBNR ఆర్టీసీ RM సంతోష్ కుమార్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. 24న 26, 25న 51, 26న 151, 27న 91, 28న 38 బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీశైలం వెళ్లే భక్తులు వినియోగించుకోవాలని కోరారు. 30 మందికి పైబడి ఉంటే ఆ ప్రదేశానికి బస్సు పంపుతామన్నారు.