News December 5, 2024
రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు: కలెక్టర్

జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. గురువారం ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్స్డే కార్యక్రమాల నిర్వహణపై మార్గ నిర్దేశం చేశారు.
Similar News
News October 16, 2025
గన్నవరంలో యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపులపాడు మండలానికి చెందిన గరికిపాటి సుబ్బారావుగా గుర్తించారు. అతను రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మార్కెట్ నుంచి సరుకులకు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
News October 16, 2025
కృష్ణా: బీరు బాటిళ్ల స్కాన్పై మందుబాబుల ఆందోళన.!

కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సురక్ష యాప్’పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా యాప్లో బీరు బాటిళ్లను స్కాన్ చేస్తే ‘ఇన్వ్యాలిడ్’ అని చూపించడం గమనార్హం. దీనిపై మద్యం తాగేవారు, దుకాణదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్లో సాంకేతిక లోపం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.