News December 18, 2024
రెవెన్యూ సదస్సులో పాల్గొన్న గుంటూరు కలెక్టర్

గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ బుధవారం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భూమి సమస్యలు, పట్టాల పంపిణీ, రైతుల అభ్యర్థనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సు ద్వారా ప్రభుత్వ సేవల చేరువపై దృష్టి సారించారు.
Similar News
News October 30, 2025
ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 30, 2025
ANU: దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు అందించాలని సూచించారు.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరద

ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం 4 లక్షలకు చేరువలో ఉన్న ప్రవాహం, సాయంత్రం 4 గంటల తర్వాత 5,00,213 క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీ నీటిమట్టం 13.8 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


