News December 21, 2024

రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఆన్‌లైన్లో నమోదు చేయాలి: కలెక్టర్

image

ప్రజలు, రైతులు తమ సమస్యలపై రెవిన్యూ సరస్సులలో అందించిన దరఖాస్తులను ఆన్‌లైన్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. నిర్ణీత సమయంలోపు అర్జీలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తహశీల్దార్ ఆఫీసులలో రికార్డు రూములు సక్రమంగా ఉంచుకోవాలన్నారు.

Similar News

News January 25, 2025

జలవనరుల శాఖ ఎస్ఈగా ద్వారకనాథ్ రెడ్డి

image

కర్నూలు జలవనరుల శాఖ ఎస్ఈగా ఎస్.ద్వారక నాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప తెలుగుగంగ ప్రాజెక్టులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ద్వారక నాథ్ రెడ్డి పదోన్నతిపై కర్నూలు ఎస్ఈగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ ఎస్ఈగా బాల చంద్రా రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.

News January 24, 2025

కర్నూలు: మెయిన్స్ పరీక్షకు 310 మంది అర్హత

image

కర్నూలులో 14వ రోజు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇవాళ 600 మంది అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు పిలవగా మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 310 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు.

News January 24, 2025

వినతులను త్వరితగతిన పరిష్కరించాలి: ఆదోని సబ్ కలెక్టర్

image

గోనెగండ్ల గ్రామంలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో తహశీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.