News February 14, 2025
రెవెన్యూ సదస్సుల అర్జీలను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో లేకుండా శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయి డివిజన్ స్థాయిలో ప్రతి సోమవారం అర్జీలను 100% ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు.
Similar News
News November 23, 2025
వరంగల్: ఎన్పీడీసీఎల్లో భారీ పదోన్నతులు

ఎన్పీడీసీఎల్లో పలువురు అధికారులకు పదోన్నతులు కల్పించారు. కార్పొరేట్ కార్యాలయం ఆపరేషన్ విభాగం జీఎంగా పని చేస్తున్న ఎ.సురేందర్‌ను చీఫ్ ఇంజినీర్‌గా, ఎమ్మార్టీ జీఎం ఎం.అన్నపూర్ణ దేవిని ఎమ్నార్టీ చీఫ్ ఇంజినీర్‌గా నియమించారు. ఏడుగురు అకౌంట్స్ ఆఫీసర్లు, ఆరుగురు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ AOలుగా పదోన్నతులు ఇచ్చారు. పలు జిల్లాల్లో ఎస్ఈ, జీఎం స్థాయిలో బదిలీలు, నియామకాలు నిర్వహించారు.
News November 23, 2025
వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం.. IBSA నాయకులతో మోదీ

జొహనెస్‌బర్గ్‌లో జరుగుతున్న G20 సమ్మిట్‌లో IBSA (ఇండియా-బ్రెజిల్-సౌతాఫ్రికా) నాయకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వాలకు IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్, IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. 40 దేశాల్లో విద్య, హెల్త్, మహిళా సాధికారతకు IBSA ఇస్తున్న మద్దతును ప్రశంసించారు.
News November 23, 2025
వరంగల్: నగలతో ఉడాయించిన నిత్య పెళ్లికూతురు..!

పెళ్లయి 16 ఏళ్ల కూతురు ఉన్నా తనకింకా పెళ్లి కాలేదని నమ్మించింది. పలు మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ పెట్టి అమాయకులను పెళ్లి చేసుకొని, అనంతరం అందినకాడికి డబ్బు, నగలతో ఉడాయిస్తున్న నిత్య పెళ్లికూతురు తాజాగా తన ప్రతాపాన్ని చూపించింది. వరంగల్(D) పర్వతగిరి(M)లోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని గత నెలలో పెళ్లిచేసుకుని ఇంట్లో ఉన్న నగలతో పదిరోజుల క్రితం పరారైనట్లు సమాచారం. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.


