News April 10, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో బుధవారం రెవెన్యూ వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ పరమైన అన్ని అంశాలపై, ప్రభుత్వ జీవోలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్‌లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు.
Similar News
News November 15, 2025
మార్గశిర ఉత్సవాలకు దేవదాయ శాఖ మంత్రికి ఆహ్వానం

బురుజుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆలయ ఈవో శోభారాణి ఆహ్వానించారు. విజయవాడలో శనివారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని వసతి, రక్షణ, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు, తదితర అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రికి ఈవో వివరించారు.
News November 15, 2025
CII సమ్మిట్.. శ్రీసిటీలో మరో 5 ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

CII సమ్మిట్‌లో మరో 5 ప్రాజెక్ట్‌లను CM చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతి (D) శ్రీసిటీలో ఈ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నట్లు CM చెప్పారు. పార్క్‌లో ఇప్పటికే 240 యూనిట్లు ఉండగా.. వెర్మీరియన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్మ్వెస్ట్ మిరాయ్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, థింక్ గ్యాస్, ఆన్‌లోడ్‌గేర్స్ ఎక్స్‌పోర్ట్స్, యూకేబీ ఎలక్ట్రానిక్స్ ఈ లిస్ట్‌లో చేరనున్నాయి.
News November 15, 2025
విశాఖ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరానికి చెందిన బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని నెల్లూరుకు చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.


