News April 10, 2025

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డా.స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీసర్వే పౌర సేవలపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Similar News

News April 20, 2025

నేడే మెగా డీఎస్సీ.. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు

image

ఆదివారం ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు కలవు. ఇందులో SA లాంగ్వేజ్-1లో 37, SA హిందీ 11, SA ఇంగ్లీష్ 65, SA మ్యాథ్స్ 33, SA-PS 14, SA-BS 34, SA సోషల్ 70, SA-PE 81, SGT 113 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వేల్ఫేర్ ఆస్రంలో 85 పోస్టులు భర్తీ చేయనున్నారు.

News April 20, 2025

ఇచ్ఛాపురంలో నేడు  కేంద్రమంత్రి పర్యటన

image

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు(ఆదివారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. సోంపేట మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించనన్నారు. కంచిలి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మండలంలో బెల్లుపడలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొని, అనంతరం ప్రజలు నుండి వినతులు స్వీకరిస్తారు.

News April 19, 2025

పైడిభీమవరంలో మహిళ దారుణ హత్య

image

రణస్థలం మండలం పరిధిలో పైడిభీమవరం పంచాయతీ గొల్లపేటకు చెందిన భవాని(26)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతురాలు పైడిభీమవరంలోని ఓ హోటల్‌లో పని చేస్తుంది. శనివారం సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వస్తుండగా చిన్న చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!