News April 2, 2025
రెవెన్యూ సేవలలో జాప్యం వద్దు: అనకాపల్లి కలెక్టర్

రెవెన్యూ సేవలలో జాప్యం ఉండకూడదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ నుంచి బుధవారం రెవెన్యూ శాఖకు సంబంధించిన రీసర్వే మ్యూటేషన్లు, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, నీటి తీరవా వసూళ్లు తదితర అంశాలపై తహశీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.
Similar News
News April 10, 2025
కువైట్‌లో కాకినాడ జిల్లా మహిళపై యాసిడ్ దాడి

భర్త మృతితో కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన మహిళ యాసిడ్ దాడికి గురై అక్కడ చిక్కుకుపోయింది. యూ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త చనిపోవడంతో కువైట్‌లో పనికి వెళ్లింది. కడపకు చెందిన ఓ ఏజెంట్ ఆమెను 2నెలల క్రితం పంపించాడు.150 దీనార్ల జీతమని చెప్పి 100 దీనార్లే ఇవ్వడంతో ఆమె ప్రశ్నించింది. దీంతో యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ విషయం ఆమె కుటుంబీకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 10, 2025
చిత్తూరు: ముగిసిన టెన్త్ వ్యాల్యుయేషన్

చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో ఏడు రోజులుగా సాగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,74,808 పదో తరగతి పరీక్షల జవాబుపత్రాలను ఈనెల 9వ తేదీ వరకు దిద్దామన్నారు.
News April 10, 2025
YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. TDP సంచలన నిర్ణయం

AP: YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన iTDP కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు TDP ప్రకటించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరింది. దీంతో గుంటూరు పోలీసులు కిరణ్‌పై కేసు ఫైల్ చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేసింది. కాగా భారతిపై కామెంట్స్ చేయడంపై YCP తీవ్రంగా స్పందించింది. దీంతో కిరణ్ <<16049878>>క్షమాపణలు<<>> చెప్పాడు.