News November 21, 2024

రేగిడి: భార్య ఎదుటే భర్త కిడ్నాప్‌

image

రేగిడి ఆమదాలవలస మండలం కొడిస గ్రామానికి చెందిన పట్నాల అన్నాజీని నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకువెళ్లిపోయినట్లు భార్య పద్మ బుధవారం రేగిడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్థులు కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ కారును ఆపకుండా వేగంగా వెళ్లిపోయినట్లు గ్రామస్థులు వాపోయారు. అన్నాజీ రాజాం పట్టణంలో పుచ్చల వీధిలో గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్నట్లు బంధువులు తెలిపారు.

Similar News

News December 13, 2024

ఇచ్ఛాపురం: మసీదులో హిందువులు ప్రత్యేక పూజలు

image

ఇచ్ఛాపురం పట్టణంలోని పీర్ల కొండపై గురువారం పీర్ల పండగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్ర-ఒడిశా నుంచి వందలాది మంది భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏటా నవంబర్‌లో నాలుగు గురువారాలు కొండపై పీర్ల పండుగ ఇక్కడ జరుగుతుంది. కొండపై ఉన్న మసీదుకు హిందువులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహిస్తారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

News December 12, 2024

SKLM: రేషన్ పంపిణీలో జాప్యం వద్దు-జేసీ

image

ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీని వేగవంతం చేసి అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు సకాలంలో వారి ఇంటి ముంగిటికే సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రేషన్ డీలర్లు, ఎండీఓ ఆపరేటర్లు, వేర్ హౌసింగ్ గొడౌన్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం పంపిణీలో ఎటువంటి సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

News December 12, 2024

శ్రీకాకుళం: IIITలో చనిపోయింది ఎవరంటే..?

image

శ్రీకాకుళం జిల్లా ఎస్ఎంపురం IIIT క్యాంపస్‌లో ఓ విద్యార్థి చనిపోయిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు(M) పీఆర్సీ తండాకు చెందిన రమావత్ నాయక్, విజయబాయి కుమారుడు ప్రవీణ్ నాయక్(18) సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను హాస్టల్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.