News September 18, 2024
రేగిడి: సూసైడ్ లెటర్ రాసి విద్యార్థి ఆత్మహత్య
రేగడి ఆమదాలవలస అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన గోగుల యోగేశ్వరరావు(20) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అతడు సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లు ఎస్సై నీలావతి తెలిపారు. ‘దానిలో తాను కెరియర్లో సక్సెస్ అవ్వలేక పోతున్నా, కుటుంబ సభ్యులను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రయత్నించా, కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నా’ అంటూ విద్యార్థి రాశాడు.
Similar News
News October 13, 2024
SKLM: మద్యం సీసా గుచ్చుకొని యువకుడి మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. మెళియాపుట్టి మండలం మురికింటిభద్ర గ్రామానికి చెందిన సవర సురేశ్(28) మద్యం తాగి బైకుపై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అప్పటికే మద్యం బాటిళ్లను కడుపులో ఉంచుకొని డ్రైవ్ చేస్తుండటంతో.. అవి పగిలిపోయాయి. సీసా పగిలి కడుపులో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడటంతో సురేశ్ మృతి చెందాడు. ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 12, 2024
శ్రీకాకుళం: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె గుర్తుకొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. పల్లెల్లో తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.