News February 12, 2025
రేగొండలో అత్యధికం.. పలిమెలలో అత్యల్పం

భూపాలపల్లి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 109 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం రేగొండ మండలంలో 63 పోలింగ్ కేంద్రాలు, గోరి కొత్తపల్లి 33, భూపాలపల్లి 59, చిట్యాల 59, గణపురం 58, కాటరం 57, మహాదేవపూర్ 48, మల్హార్ 46, మొగుళ్లపల్లి 56, మహమూత్తారం 42, పలిమెల 13, టేకుమట్ల 44 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
Similar News
News March 16, 2025
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైబల్ యూనివర్శిటీ వీసీ

సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్. శ్రీనివాస్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీనివాస్ శాలువాతో సన్మానించి సత్కరించారు. మొట్టమొదటి, నూతన వీసీగా నియామకమైన శ్రీనివాస్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని సూచించారు.
News March 16, 2025
అమరజీవి త్యాగం మరువలేనిది: జిల్లా ఎస్పీ

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా ఎస్పీ వి. రత్న తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.
News March 16, 2025
రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా?: కోహ్లీ

ఆటగాళ్లు పర్యటనలో ఉన్నప్పుడు వెంట కుటుంబాలను తీసుకెళ్లకూడదని BCCI విధించిన తాజా నిబంధనపై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘మ్యాచుల్లో ఎంతో తీవ్రతతో ఆడుతుంటాం. మ్యాచ్ పూర్తికాగానే కుటుంబం చెంతకు చేరడం ఎంతో రిలీఫ్ ఇస్తుంటుంది. అది ఆటగాళ్లకు చాలా అవసరం. అంతేకానీ మ్యాచ్ ముగిశాక రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా? కుటుంబాలు మాతో ఉండటం ఎంత అవసరమో కొంతమందికి తెలియట్లేదు’ అని పేర్కొన్నారు.