News April 9, 2025
రేగొండ: అకాల వర్షం రైతులకు భారీ నష్టం

రేగొండ మండల వ్యాప్తంగా గత రాత్రి వీచిన గాలి తీవ్రతకు రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల శివారులోని ఎడ్ల మల్లారెడ్డికి చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట గాలులకు నేలకొరిగింది. చేతికొచ్చే పంట నెలకు పడిపోవడంతో రైతును ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల్లో గాలి దుమారానికి వృక్షాలు నేలకు పడ్డాయి. కాగా, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News December 6, 2025
గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>
News December 6, 2025
టైప్ 5 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటో తెలుసా?

* న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చర్మం, జుట్టు రంగుమారడం.
* లాలాజల గ్రంథుల్లో మార్పులు.
* రోగనిరోధక శక్తి తగ్గడంతో తరచూ చర్మం, చిగుళ్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.
* BMI (18.5) కంటే తక్కువ ఉండడం.
* దీర్ఘకాల పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం వంటివి టైప్-5 డయాబెటిస్ లక్షణాలు.
* అధిక దాహం, ఒకేసారి బరువు తగ్గడం, నీరసం, కంటిచూపు తగ్గడం డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.
News December 6, 2025
డబ్బులు రీఫండ్ చేస్తున్నాం: ఇండిగో

భారీగా విమానాల రద్దు నేపథ్యంలో <<18487498>>కేంద్రం<<>> సీరియస్ అవడంతో ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేస్తున్నామని ఇండిగో ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 5-15 వరకు జరిగిన బుకింగ్స్కు సంబంధించి క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ప్రశ్నలు అడగకూడదని పేర్కొంది. మరోవైపు ఫుల్ అమౌంట్ రీఫండ్ అవట్లేదని ప్రయాణికులు కామెంట్లు చేస్తున్నారు.


