News February 22, 2025
రేగొండ, చిట్యాల మండలాల రైతులకు మేలు

భూపాలపల్లి జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ నుంచి సరఫరా అయ్యే నీటి విడుదల వల్ల రేగొండ, చిట్యాల మండలాల రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వ్యవసాయ ఇరిగేషన్ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వ్యత్యాసం లేకుండా సాగు వాస్తవ నివేదికలు అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో గత రబీ సీజన్లో 86 వేల ఎకరాల్లో పంట సాగు జరిగిందని, ఈ రబీ సీజన్లో 82 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News March 20, 2025
ADB: ఈసారైనా స్టేట్‌లో సింగిల్ డిజిట్ వచ్చేనా..!?

పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ, శ్రద్ధ వహించారు. గత 2023 సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 92.93 శాతంతో ఆదిలాబాద్ 17వ స్థానంలో నిలవగా 2022లో 19వ స్థానంలో నిలిచింది. ఈసారి వంద శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవడానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక చేపట్టి వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ చేశారు.
News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
News March 20, 2025
తిరుపతిలో యువకుడు దారుణ హత్య

తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపు 30 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని రెండు మూడు రోజుల క్రితం హత్య చేశారు. మృతుడు మొఖం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతుడు వద్ద ఇటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు, క్లూస్ టీం బృందం పరిశీలించింది.