News March 25, 2025
రేగొండ, పలిమెల, మల్హర్ మండలాల్లో వాటర్ షెడ్ యాత్ర

రేగొండ, పలిమెల, మల్హర్ మండలాల్లోని మండలానికి రెండు గ్రామాల చొప్పున వాటర్ షెడ్ యాత్రను నిర్వహించనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నీటి పరిరక్షణ, సాగునీటి వనరుల పునరుద్ధరణ లక్ష్యంగా ‘వాటర్ షెడ్ యాత్ర’ చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నీటి నిల్వలను మెరుగుపరచడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం, రైతులకు నీటి సదుపాయం అందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
Similar News
News October 20, 2025
VJA: దీపావళి టపాసులను వదలని రాజకీయం..!

విజయవాడలో దీపావళి సందడి మొదలైంది. అయితే.. టపాసులపై కూడా రాజకీయ పార్టీల గుర్తులను ముద్రించి విక్రయించడం విశేషంగా నిలిచింది. నగరంలోని దుకాణాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ‘షాట్స్’ అందుబాటులో ఉంచారు. వీటిని వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారని దుకాణ నిర్వాహకులు చెబుతున్నారు.
News October 20, 2025
జనగామ: బోర్డుకే పరిమితమైన గిరిజన కార్యాలయం

జనగామ జిల్లాలోని గిరిజనుల గోడు పట్టించుకునే వారు కరవయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలో 60 వేల మంది గిరిజనులు ఉన్నారు. కానీ వారి ఇబ్బందులను ఆలకించే అధికారి మాత్రం స్థానికంగా ఉండరు. జనగామ కలెక్టరేట్లో గిరిజన శాఖకు గదిని కేటాయించినప్పటికీ సంబంధిత శాఖకు ఏ ఒక్క అధికారి ఉండకపోవడంతో గిరిజన సమస్యలు చెప్పుకునేందుకు హన్మకొండలోని గిరిజన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది.
News October 20, 2025
ADB: గుస్సాడీ వేషధారణలో బాలుడు

ఉమ్మడి జిల్లాలో దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఆదివాసీలు చేసే గుస్సాడీ నృత్యం ప్రత్యేకం. భీంపూర్(M) వాడేగామలో కాత్లే ఉమేశ్(3) గుస్సాడీ వేషధారణలో ఆకట్టుకున్నాడు. బాలుడి వేషం వారి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంది. ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందజేస్తున్నారనేదానికి ఈ ఫొటో నిదర్శనం. తమ వారసత్వాన్ని పిల్లలు సైతం కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.