News April 13, 2025
రేగొండ: విద్యుత్ షాక్తో మహిళ మృతి

రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పనులు చేస్తూ కిటికీ ఊచలను పట్టుకుంది. ఇంట్లోకి వెళ్లే విద్యుత్ తీగలు కిటికికీ తాకడంతో కిటికీని పట్టుకున్న నీలమ్మకు షాక్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 24, 2025
ఖమ్మం: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన ఏన్కూరు మండలం నాచారంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న తాటి గోవర్ధన(32)ను భర్త రామారావు అనుమానించేవాడు. ఈ విషయమై తెల్లవారుజామున ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విసుగు చెందిన రామారావు గొడ్డలితో భార్యను చంపి, అనంతరం స్థానిక ఠాణాలో లొంగిపోయాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 24, 2025
19 మృతదేహాలు వెలికితీత

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News October 24, 2025
వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,010 పలకగా.. గురువారం రూ.6,810కి పడిపోయింది. ఈరోజు మళ్లీ పెరిగి, రూ.6,905కి చేరింది. రైతులు నాణ్యమైన, తేమలేని పత్తి తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.


