News March 14, 2025
రేగొండ: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి(52) డీబీఎం-38 కెనాల్ మోటార్ పైపు కింద చెత్తను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరణ జరిగి రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
Similar News
News March 15, 2026
గోదావరిఖని: సింగరేణి అధికారుల సమ్మె హెచ్చరిక

సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేపు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు అధికారుల సంఘం ప్రకటించింది. ఇల్లందు క్లబ్లో జరిగిన సమావేశంలో ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్మిపతి గౌడ్, జనరల్ సెక్రటరీ పెద్ది నర్సింహులు మాట్లాడుతూ.. పీఆర్పీ బకాయిలు, పే అప్‌గ్రేడేషన్, పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చకపోతే మార్చి 31 లోపు ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
News March 15, 2026
ఏలూరు జిల్లాలో డ్యామ్‌లో మునిగి దేవరపల్లి వాసుల మృతి

దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డ్యామ్‌లో మునిగి మరణించారు. గల్లంతైన వారిని తుమ్మల నాగరాజు, రమణగా గుర్తించారు. పోలీసుల వివరాలు.. గుబ్బల మంగమ్మ ఆలయంకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.