News September 20, 2024
రేగోడు తహశీల్దార్ SUSPEND

రేగోడు తహశీల్దార్ బాలలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓ రమాదేవి తహశీల్దార్ ఆఫీస్‌ను ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో ఎమ్మార్వో అందుబాటులో లేరు. దీంతో అక్కడికి వచ్చిన రైతులతో ఆర్డీఓ మాట్లాడారు. తహశీల్దార్ నిత్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, బాధ్యతలపై నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు తెలిపారు. దీంతో తహశీల్దార్‌ని సస్పెండ్ చేశామని ఆర్డీవో తెలిపారు.
Similar News
News December 24, 2025
ఐటీ విభాగంలో మెదక్ పోలీస్ సిబ్బంది ప్రతిభ

మెదక్ జిల్లా పోలీస్ సిబ్బంది CCTNS/ ఐటీ ఆధారిత వ్యవస్థల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర అదనపు డీజీపీ(టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు చేతుల మీదుగా కమెండేషన్ లెటర్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మెదక్ జిల్లా నుంచి ఐటీ కోర్ టీం సభ్యులు అనిల్, ఆర్.అమరనాథ్, టెక్ టీం రైటర్స్ మౌనిక, రాజు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరిని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.
News December 24, 2025
బీజేపీ సర్పంచ్‌లకు రూ. 25 లక్షల నిధులు: ఎంపీ రఘునందన్

బీజేపీ మద్దతుతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల అభివృద్ధి నిధులు తప్పకుండా తీసుకొస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిలో బీజేపీ ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
News December 24, 2025
నర్సాపూర్: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన వేణు (24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


