News September 20, 2024

రేగోడు తహశీల్దార్ SUSPEND

image

రేగోడు తహశీల్దార్ బాలలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓ రమాదేవి తహశీల్దార్ ఆఫీస్‌ను ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో ఎమ్మార్వో అందుబాటులో లేరు. దీంతో అక్కడికి వచ్చిన రైతులతో ఆర్డీఓ మాట్లాడారు. తహశీల్దార్ నిత్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, బాధ్యతలపై నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు తెలిపారు. దీంతో తహశీల్దార్‌ని సస్పెండ్ చేశామని ఆర్డీవో తెలిపారు.

Similar News

News October 9, 2024

సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ సమీక్ష

image

పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పాల్గొన్నారు. ఎన్నికల ఓటర్ లిస్టు ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News October 9, 2024

రేపు దద్దరిల్లనున్న మెదక్!

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా అంతటా రేపు రాత్రి సందడే సందడి. ఆయా జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 9, 2024

కల్హేర్: ఒకే గ్రామం నుంచి ఆరుగురికి టీచర్ జాబ్స్

image

డీఎస్సీ తుది జాబితాల్లో కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన యువత సత్తా చాటారు. గ్రామానికి చెందిన మల్లేశ్, లక్ష్మణ్, సురేశ్ , సతీశ్, స్వాతి, అరుణ్ టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో వారి తల్లితండ్రులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. వీరంతా మార్డి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదినవారే. తాజాగా గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి ఎంపిక కావడంతో గ్రామస్థులు, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.
-CONGRATS