News January 6, 2025

రేగోడ్:గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుందా?

image

ఈ నెల రెండో వారంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగనున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో రేగోడ్ మండలంలోని 17 గ్రామపంచాయతీలో ఎన్నికల హడావిడి ఊపందుకొనుంది. సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులు సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికల గుర్తులను ముద్రణ చేసేందుకు సిద్ధమయ్యారు.

Similar News

News November 23, 2025

మెదక్: సత్యసాయి బాబాకు కలెక్టర్ నివాళులు

image

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా మెదక్ కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ నివాళులు అర్పించారు. సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి సేవలను కొనియాడారు. ఆయన చూపిన ప్రేమ, అహింస, సత్యం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, సత్య సాయి సేవ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు శిరిగా ప్రభాకర్, సాయిబాబా, శంకర్ గౌడ్, ప్రసన్న కుమారి ఉన్నారు.

News November 23, 2025

మెదక్: మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

ఫేక్ ట్రేడింగ్, ఫేక్ ఐపీఓలు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్లైన్ ట్రేడింగ్, బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.