News July 11, 2024

రేగోడ్: పాముకాటుతో వివాహిత మృతి

image

మండల పరిధిలోని గజ్వాడ గ్రామంలో చేను పనులు చేస్తుండగా గుర్ల రామమ్మకు పాము కాటు వేసింది. అక్కడే ఉన్న భర్త మల్లేశం, కుమారుడు రాజు అంబులెన్స్ కొరకు ప్రయత్నించగా అంబులెన్స్ అందుబాటులో రాలేదు. చేను వరకు ఆటో పిలిపించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆలస్యం కావడంతో రామమ్మ మృతి చెందింది. అంబులెన్స్ అందుబాటులో ఉంటే తన భార్య ప్రాణం దక్కేదని భర్త మల్లేశం బోరున వినిపించాడు.

Similar News

News February 18, 2025

MDK: వేతనాలు విడుదల చేయాలని మంత్రికి వినతి

image

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న బ్లడ్ బ్యాంక్, ఐసీయూ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు విడుదల చేయాలని మంత్రి దామోదర్‌కు ఆ ఉద్యోగ సంఘం నాయకులు శివకుమార్ వినతి పత్రం అందజేశారు. గత 6 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి విన్నవించారు. దీంతో మంత్రి స్పందించి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అధికారికి వివరణ కోరగా వేతనాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

News February 18, 2025

మెదక్: కోతి చేష్టలు.. షార్ట్ సర్య్కూట్‌తో ఇల్లు దగ్ధం

image

కోతులు కరెంట్ వైర్లను ఊపడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు దగ్ధమైన ఘటనలో రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు పేర్కొన్నారు. మెదక్ పట్టణం కుమ్మరిగడ్డలో ల్యాబ్ టెక్నీషియన్ కుమ్మరి సంతోష్ ఇల్లు సోమవారం షార్ట్ సర్య్కూట్‌తో ఖాళిపోయిన విషయం తెలిసిందే. మెడికల్ ల్యాబ్ ఏర్పాటు కోసం సమకూర్చుకున్న రూ.4 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, సామాగ్రి, సర్టిఫికెట్‌లు కాలి బూడిదయ్యాయి.

News February 18, 2025

20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం.. వెంటనే నోటిఫికేషన్లు: మంత్రి

image

20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసి 25 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాదులోని టూరిజం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్ ఇవ్వమని సీఎం చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసి 25 వేల ఉద్యోగం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు.

error: Content is protected !!