News April 13, 2025
రేణిగుంటలో గాల్లోనే విమానం..!

రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండింగ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రాత్రి 8:40కి ఇండిగో విమానం చేరుకుంది. ఈదురు గాలులతో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండింగ్కు క్లియరెన్స్ రాలేదు. దాదాపు అరగంట పాటు ఆకాశంలోనే విమానం చక్కర్లు కొట్టింది. గాలుల తీవ్రత తగ్గకపోవడంతో ఆ విమానాన్ని చెన్నైకి మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు.
Similar News
News November 1, 2025
GWL: ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

గద్వాల జిల్లాలోని మానవపాడు మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. చెన్నిపాడులోని దారిలో ఉన్న అతి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వారు. విషయం తెలుసుకున్న VHP జిల్లా నాయకుడు మానవపాడు రఘు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయ పరిసరాలను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 1, 2025
పరకామణి కేసులో నిందితుడు, ప్రతివాదులకు నోటీసులు…!

పరకామణి కేసులో ప్రధాన నిందితుడైన సీవీ రవి కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రతివాదులైన అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ సెక్రటరీ, ఏపీ లీగల్ సర్వీస్ సెక్రటరీ, సీఐడీ డీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్వో, తిరుమల – 1 టౌన్ సీఐలతో పాటు మరి కొందరికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.
News November 1, 2025
ఖమ్మం: కలకలం రేపుతున్న సీపీఎం నేతల హత్యలు!

జిల్లాలో సీపీఎం నేతలు హత్యలకు గురికావడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. 2022లో దుండగుల చేతిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుతం చింతకాని(M) పాతర్లపాడులో రామారావు అదే రీతిలో దుండగుల చేతిలో హతమయ్యాడు. వీరిద్దరూ స్థానికంగా బలమైన, పార్టీలో కీలక నేతలు కావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలోనే.. అది కూడా CPM నేతలే హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది.


