News April 13, 2025
రేణిగుంటలో గాల్లోనే విమానం..!

రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండింగ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రాత్రి 8:40కి ఇండిగో విమానం చేరుకుంది. ఈదురు గాలులతో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్‌పోర్ట్ నుంచి ల్యాండింగ్‌కు క్లియరెన్స్ రాలేదు. దాదాపు అరగంట పాటు ఆకాశంలోనే విమానం చక్కర్లు కొట్టింది. గాలుల తీవ్రత తగ్గకపోవడంతో ఆ విమానాన్ని చెన్నైకి మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు.
Similar News
News April 19, 2025
MNCL: పోలీసులను ఇబ్బంది పెట్టిన ముగ్గురి అరెస్ట్

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు రవి ఓ లాడ్జి ఎదుట బైక్‌పై ముగ్గురు వ్యక్తులు కూర్చొని న్యూసెన్స్ చేస్తుండగా వెళ్లి అడిగారు. డ్యూటీలో ఉన్నారని తెలిసి పోలీసులను తిట్టిన బానోత్ సాయి వికాస్, సిలారపు వినయ్, ఓ మైనర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News April 19, 2025
ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
వ్యవసాయంలో నూతన సాంకేతికతను అలవర్చుకోవాలి: రాజనర్సింహ

రైతులందరూ నూతన సాంకేతిక నలబరుచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పండగల మార్చిందన్నారు. రాయికోడ్ ప్రాంతానికి లిఫ్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.