News April 12, 2025

రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో RRRకు వీడ్కోలు

image

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సాదర వీడ్కోలు లభించింది. శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కూటమి నాయకులు ఆయనకు వీడ్కోలు పలికారు. అనంతరం విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

Similar News

News October 27, 2025

పంచభూతాల నుంచి నేర్చుకుందాం!

image

జీవితంలో విజయం సాధించడానికి పంచభూతాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. భూమిలా సహనంతో ధైర్యంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. నీరు మురికిని కడిగినట్టు మంచి మనసుతో నెగటివిటీని దూరం చేయాలి. ఎక్కడా అటాచ్ అవ్వకుండా గాలిలా స్వేచ్ఛగా జీవించాలి. నిప్పులా మీ ఆత్మవిశ్వాసం, శక్తి ప్రకాశవంతంగా వెలగాలి. ఆకాశం దేనికీ కనెక్ట్ అవ్వనట్టు, మనపై పని ఒత్తిడి పడకుండా రిలాక్స్డ్‌గా ఉండాలి. SHARE IT

News October 27, 2025

గద్వాల: ఆన్‌లైన్ చెల్లింపులతో లబ్ధిదారులకు ఆనందం

image

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అమలవుతోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బిల్లుల ఆమోదం నుంచి చెల్లింపుల వరకు లబ్ధిదారులు ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వం ఆన్‌లైన్ విధానంలో నేరుగా చెల్లింపులు చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News October 27, 2025

HYD: సిట్టింగ్ స్థానం కోసం BRS అడుగులు

image

జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు BRS అడుగులు వేస్తుంది. 3 పర్యాయాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ స్థానం ఎట్టి పరిస్థితిలో చేజారకుండా గట్టి ప్రయత్నాలకు దిగింది. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సెంటిమెంట్‌ను నమ్ముకుని రంగంలోకి దిగింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్ట నున్నారో వేచి చూడాల్సిందే.