News June 21, 2024
రేణిగుంట : IIDTలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (IIDT) నందు 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. AI/ML సైబర్ సెక్యూరిటీ/ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://iidt.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.
Similar News
News October 31, 2025
CTR: పదేళ్ల నుంచి జైల్లోనే ఆ ఇద్దరు..!

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. 2015 నవంబర్ 15న హత్య జరిగిన తర్వాత ఐదుగురు అరెస్ట్ అయ్యారు. పలువురికి కండిషన్ బెయిల్ వచ్చింది. ఇదే కేసులో A3గా ఉన్న జయప్రకాశ్, ఏ4 మంజునాథ్కు చాలా కారణాలతో బెయిల్ రాలేదు. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటికీ జైల్లోనే జీవితం గడుపుతున్నారు. మిగిలిన వాళ్లు జైలు నుంచి విడుదలయ్యారు. తీర్పు రావడంతో మరోసారి జైలుకు వెళ్లారు.
News October 31, 2025
ఇంజినీరింగ్ చదివిన చింటూ.. చివరకు!

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో A1 నిందితుడైన, ఉరిశిక్ష పడ్డ చింటూ అలియాస్ చంద్రశేఖర్.. <<18157620>>కఠారి మోహన్కు మేనల్లుడు<<>>. ఇంజినీరింగ్ చేసి మంచి ఉద్యోగం చేసే చింటూ మామకోసం ఆయన వెంట నడిచాడు. సీకే బాబుపై 2007లో జరిగిన బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగు కేసులో యావజ్జీవ శిక్ష పడినా, తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత అన్ని విషయాల్లో తలదూర్చి వ్యక్తిగత, ఆర్ధిక, పవర్ విభేదాలతో మేనమామ దంపతులను హత్య చేశాడు.
News October 30, 2025
బాధిత కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ సాయం

ప్రమాదాలకు గురైన పోలీసు కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ గురువారం ఆర్థిక సాయం అందజేశారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మురుగేషన్, సాయుధ దళంలో విధులు నిర్వహిస్తున్న రవితేజ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు IDRF ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఎస్పీ చెక్కులను అందజేశారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.


