News February 19, 2025
రేపటి నుంచి కేయూ దూర విద్య సెమిస్టర్ పరీక్షలు

కేయూ పరిధిలోని దూర విద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎంఏ జర్నలిజం, హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Similar News
News March 19, 2025
రాష్ట్రస్థాయి పైలట్ ప్రాజెక్టులో కొలనూర్ గ్రామం

ఓదెల మండలంలోని కొలనూర్ గ్రామానికి రైతు గుర్తింపు కార్డుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైనట్టు మండల వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు ఇస్తుందని తెలిపారు అందులో భాగంగా రేపు కొలనూరు రైతువేదికలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు ఆధార్ కార్డు, భూమిపట్టా పాస్‌బుక్ తీసుకొని రావాలని సూచించారు. భూమి ఉన్న ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు
News March 19, 2025
వనపర్తి: కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది: రాజేంద్రప్రసాద్

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి బీసీ ఎస్సీ వర్గాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదని వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ జిల్లా ఆఫీసులో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం కోసం కులగణనను చేపడతామన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేశారన్నారు.
News March 19, 2025
మెదక్: యువకుడి సూసైడ్

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గరుగుల భాను(19) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.