News January 31, 2025

రేపటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్

image

మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 1నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 28, 2025

ఫూలే వర్ధంతి: మంత్రి పొన్నం నివాళి

image

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఫూలే చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

News November 28, 2025

మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.