News October 2, 2024
రేపటి నుంచి టెట్ పరీక్ష ప్రారంభం
కర్నూలు జిల్లాలో 6 పరీక్ష కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేశారు. దాదాపు 40,660 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 విడతలుగా నిర్వహిస్తున్నారు. కర్నూలులో 4, ఆదోని, ఎమ్మిగనూరులో ఒక్కొక్క కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకుడు నరసింహారావు, విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News October 9, 2024
హత్య కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు
నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన బాల ఓబన్నకు తన భార్యను హత్య చేసిన కేసులో ఆళ్లగడ్డ అదనపు జిల్లా జడ్జి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాల ఓబన్న గతేడాది భార్య నేసే నాగమ్మను హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు దఫాల విచారణ అనంతరం న్యాయమూర్తి తుది తీర్పును మంగళవారం వెలువరించారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు.
News October 9, 2024
కర్నూలు జిల్లాలో ప్రమాదం.. బాలుడి మృతి, ఆరుగురికి గాయాలు
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దకడబూరు మండలం పులికనుమ వద్ద ఆటోని బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో వీరేశ్ (13) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ తరలించారు. వీరంతా బసలదొడ్డి గ్రామం నుంచి కూరగాయలు అమ్ముకొని ఆదోని వస్తుండగా ఈ ఘటన జరిగింది. బొలెరో వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
News October 9, 2024
కర్నూలులో రూ.20కోట్లతో ఆహార పరీక్షా ల్యాబ్
రాష్ట్రంలో FSSAI ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రతి జిల్లాలోనూ ఆహార పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరగా FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ అఫీసర్ కమలవర్ధనరావు అంగీకరించారు. ఈ ఒప్పందం మేరకు రూ.20 కోట్లతో కర్నూలులోనూ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ ల్యాబ్‌ను నెలకొల్పనున్నారు.