News September 11, 2024
రేపటి నుంచి దులీప్ ట్రోఫీలో 2 మ్యాచులు
దులీప్ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి RDT స్టేడియంలోని రెండు మైదానాల్లో మ్యాచులు జరగనున్నాయి. నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండియా టీం-ఏ, ఇండియా టీం-డీ మ్యాచ్ ఆర్డీటీ ప్రధాన స్టేడియంలో జరగనుంది. ఇండియా టీం-బీ, ఇండియా టీం-సీ మధ్య మరో మ్యాచ్ క్రీడాగ్రామంలోని రెండో గ్రౌండ్‌లో జరగనుంది. ప్రధాన స్టేడియంలో జరిగే మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులకు అవకాశం ఉంటుంది.
Similar News
News October 12, 2024
అనంతపురం జిల్లాలో 136 దుకాణాలకు 3144 దరఖాస్తులు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 136 నూతన ప్రైవేటు మద్యం దుకాణాలకు 3144 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా విడపనకల్లులో 111వ దుకాణానికి 51 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా తాడిపత్రి పరిధిలో 16 దుకాణాలకు కేవలం 97 దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. అయితే అనంతపురం నగరంలో 30 దుకాణాలకు 1056 దరఖాస్తులు వచ్చాయి.
News October 12, 2024
విద్యార్థులందరికీ విజయాలు చేకూరాలి: మాజీ రిజిస్ట్రార్
జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ సీ.శశిధర్ విజయదశమి శుభాకంక్షాలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో విద్యార్థులందరికీ విజయాలు చేకూరాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరిసేలా జగన్మాత దీవెనలు లభించాలని ఆకాంక్షించారు.
News October 11, 2024
రాబోయే 3 రోజులలో భారీ వర్షాలు: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే మూడు రోజులలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతను పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల 14 నుంచి 16వ తేదీ వరకు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.