News July 20, 2024
రేపటి నుంచి నరసాపురం- డోన్ రైలు పునరుద్ధరణ

నరసాపురం- డోన్ల మధ్య నడిచే ఎరిక్సన్ రైలును ఈ నెల 21 నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాక్ మరమ్మతు పనులు కారణంగా ఈ రైలు 3 నెలలుగా నిలిపివేశారు. 17282 నంబర్తో నరసాపురంలో ఉదయం 6 గంటలకు బయలుదేరి విజయవాడ- గుంటూరు మార్కాపురం, నంద్యాల మీదుగా రాత్రి 9 గంటలకు డోన్ చేరుకుంటుంది. జిల్లా నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
Similar News
News December 7, 2025
భీమవరం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్

భీమవరం ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.2 కోట్ల CSR నిధులతో నిర్మించే డయాలసిస్ సెంటర్కు ఆదివారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి భూమిపూజ చేశారు. 8 యంత్రాలు, 10 బెడ్లతో ఈ సెంటర్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు లభించి, దూర ప్రాంతాలకు వెళ్లే కష్టం తప్పుతుందని వారు పేర్కొన్నారు.
News December 7, 2025
భీమవరం: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 7, 2025
HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.


