News October 6, 2024

రేపటి నుంచి యూనివర్సిటీలకు దసరా సెలవులు

image

కర్నూలు జిల్లాలోని యూనివర్సిటీలకు దసరా సెలవులు ప్రకటించారు. రాయలసీమ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలకు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ వీ.లోకనాథ తెలిపారు. 14వ తేదీ తిరిగి పునఃప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.

Similar News

News December 22, 2024

గుండెపోటుతో పాత్రికేయుడి మృతి

image

గడివేముల మండల విలేకరి మహబూబ్ బాషా గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. 4 రోజుల నుంచి అస్వస్థతతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ‘Iam Back’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టారు. అయితే నేడు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, తోటి విలేకరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయన APUWJ సభ్యుడిగా పాత్రికేయ
రంగానికే వన్నెతెచ్చిన వ్యక్తిగా పేరు గడించారని పలువురు విలేకరులు కొనియాడారు.

News December 22, 2024

ఇంట్లో బంధించి మహిళపై ఆత్యాచారం.. నిందితుడికి రిమాండ్

image

మతిస్థిమితం లేని మహిళపై ఆత్యాచారం చేసిన జోగి హనుమంతును శనివారం రిమాండుకు తరలించినట్లు సీఐ మస్తాన్ వల్లి తెలిపారు. గత నెల 17న మతిస్థిమితం లేని మహిళను ఆదోనిలో అనాథాశ్రమంలో చేర్పిస్తానని మహిళ తల్లిదండ్రులతో నచ్చజెప్పి తీసుకొని జోగి హనుమంతు తన స్వగ్రామం ఆస్పరి మండలం ముత్తుకూరుకు తీసుకొచ్చాడు. ఇంటిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపామన్నారు.

News December 22, 2024

మత్స్య శాఖ వనరులను అభివృద్ధి పరచండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో మత్స్య శాఖ వనరులను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి మత్స్య శాఖ ఉప డైరెక్టర్ రాఘవరెడ్డిని ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అత్యల్పంగా చేపల పెంపకం మన జిల్లాలోనే ఉందన్నారు. మత్స్య సంపద అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు.