News February 18, 2025
రేపటి నుంచి శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

NGKL మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల దర్శనానికి వెళ్లే భక్తులకు 24 గంటల అనుమతి ఉందని డీఎఫ్ఓ అబ్దుల్ రావూఫ్ పేర్కొన్నారు. రేపటి నుంచి మార్చి 1 వరకు చెక్ పోస్ట్ 24 గంటలు తెరిచి ఉంటుందన్నారు. గతంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వన్యప్రాణుల సంరక్షణార్థం చెక్ పోస్ట్ మూసి ఉండేదని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి సీసాలు నిర్దేశించిన ప్రాంతంలో వేయాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.
Similar News
News December 6, 2025
ADB: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో మూడు విడతల ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు), జోనల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి సూక్ష్మ పరిశీలకులకు ఒక గ్రామ పంచాయతీని కేటాయిస్తామని, ఆ పరిధిలోని అన్ని వార్డులను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.
News December 6, 2025
WGL: 22 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ ఇన్ఛార్జ్ రేంజ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి జోన్ పరిధిలోని వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 22 మందికి పదోన్నతి కల్పించారు. ఈమేరకు జోన్ పరిధిలో వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
News December 6, 2025
‘జీవీఎంసీ స్థాయి సంఘంలో అభివృద్ధి పనులకు ఆమోదం’

విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు నగర మేయర్, స్థాయి సంఘం చైర్పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 287 అంశాలై చర్చించగా, 222 ప్రధాన అంశాలు, 30 టేబుల్ అజెండాలకు ఆమోదం లభించిందన్నారు.


