News March 3, 2025
రేపటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ

జిల్లాలో డీఎస్సీ- 2024కి ఎంపికైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు మెదక్లో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. 108 మంది ఉపాధ్యాయులు మెదక్లో జరిగే శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారు. 11 అంశాలపై ఆర్పీలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
సంగారెడ్డి: చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

చీమలకు భయపడి వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్లో నివసిస్తున్న మనీషా (25) మైర్మేకోఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News November 6, 2025
ఇదేం నిబంధన.. ‘7 క్వింటాళ్ల పరిమితిపై’ రైతుల ఆవేదన

ఖమ్మం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి సేకరణలో ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ‘దిక్కుమాలిన నిబంధన.. ఏడ్చినట్టే ఉంది’ అని రైతులు మండిపడుతున్నారు. తేమశాతం, పింజ పొడవు నిబంధనలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవాలని వారు సీసీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
News November 6, 2025
గన్నవరం: ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల నుంచి ఎంపికైన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తొలిసారి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. దీంతో చిన్నారులు భావోద్వేగానికి లోనయ్యారు. సమగ్ర శిక్షా, ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా చేపట్టిన మూడు రోజుల సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా జాతీయ మ్యూజియం, ప్లానెటోరియం సందర్శిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో అభినందించారు.


