News June 30, 2024
రేపటి నుండి కొత్త చట్టాలు!

రేపటి నుండి అమలయ్యే కొత్త చట్టాలపై జిల్లాలోని పోలీసులతో పాటు న్యాయవాదులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగులకు ఇటీవల కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని 25 పోలీస్ స్టేషన్లతోపాటు ట్రాఫిక్, మహిళ, సీసీఎస్, సైబర్ క్రైమ్, టాస్క్ ఫోర్స్, సీసీఆర్పీ, ఐటీ కోర్ టీమ్లకు సంబంధించి 888 మంది సిబ్బందికి విడతల వారీగా, బ్యాచ్‌కు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
Similar News
News February 16, 2025
కల్వకుంట్ల కవితను కలిసిన ఖమ్మం బీఆర్ఎస్ నేతలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఖమ్మంకు వచ్చిన ఎమ్మెల్సీని జిల్లా బీఆర్ఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని వారికి కవిత పలు సూచనలు చేశారు.
News February 15, 2025
ఖమ్మం మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి: కవిత

ఖమ్మం జిల్లాకు పేరుకే ముగ్గురు మంత్రులు, కానీ అభివృద్ధిలో శూన్యమని, వారు వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడుతూ.. బనకచర్ల పర్మిషన్ ఇస్తే ప్రజలు చాలా నష్టపోతారన్నారు. కళ్ల ముందు నీళ్లు వెళ్తున్నా.. ఉపయోగించుకోలేక పోతున్నామని చెప్పారు. మంత్రి తుమ్మల చాలా సీనియర్, ఆనాడు ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డారో ఆయనకు తెలుసని పేర్కొన్నారు.
News February 15, 2025
ఖమ్మం: స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి స్టేడియంను సందర్శించారు. స్విమ్మింగ్ పూల్, షటిల్ బ్యాట్ స్కేటింగ్, వ్యాయామ కేందం, జిమ్నాస్టిక్ హాల్, వాలీబాల్ కోర్టును పరిశీలించారు. క్రీడాకారులకు పౌష్టికాహారం, ఫ్రూట్స్, స్పోర్ట్ షూ అవసరమైన క్రీడా సామగ్రిని అందించాలని కోరారు.