News October 19, 2024

రేపటి మంత్రి ఆనం పర్యటన వివరాలు 

image

నెల్లూరు జిల్లాలో ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చేజర్ల మండల నాయకులతో నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సంగం మండల నాయకులతో సమావేశం అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, నేతలు పాల్గొనాలని కోరారు. 

Similar News

News January 12, 2025

నెల్లూరులో బాలకృష్ణ భారీ కటౌట్

image

నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా నెల్లూరులోని ఎస్2 థియేటర్స్ వద్ద 36 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కటౌట్‌కు 300 కిలోల పూలతో తయారుచేసిన గజమాలను కోటంరెడ్డి ఆధ్వర్యంలో అలంకరించారు.

News January 11, 2025

BREAKING: తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి

image

ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్‌పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

News January 11, 2025

నెల్లూరులో వివాహిత ఆత్మహత్య

image

కుమారుడిని అత్త మందలించిందని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు నెల్లూరు పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన రుబీనా(22) అంజద్‌కు మూడేళ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. రుబీనా రెండేళ్ల కుమారుడు సోఫాపై మూత్రం పోశాడు. దీంతో అత్త బాలుడిని మందలించింది. మనస్తాపం చెందిన రుబీనా ఇంట్లో ఉరి వేసుకుంది. కుబుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.