News February 10, 2025
రేపల్లెలో దారుణ హత్య.. UPDATE

ఆస్తి తగాదాల నేపథ్యంలో రేపల్లెలో శనివారం తెల్లవారుజామున సరస్వతి హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రేపల్లె సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి, విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి ఘటనా స్థలాన్ని ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. మహిళను హత్య చేసి మంచాన్ని డోర్ వద్దనే పెట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగల కోసం హత్య జరిగిండదని భావిస్తున్నారు.
Similar News
News November 17, 2025
కర్నూల్ ఎస్పీ PGRSకు 84 ఫిర్యాదులు

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేసి, చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్‌లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.