News February 12, 2025
రేపల్లెలో విషాదం.. తల్లి కుమారుడు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739334108594_50804161-normal-WIFI.webp)
రేపల్లె పట్టణంలో బుధవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని నాలుగో వార్డ్‌కు చెందిన వెల్లటూరు రాజకుమారి (55), ఆమె కుమారుడు నాగేంద్ర (26) బలవన్మరణానికి పాల్పడ్డారు. నాగేంద్ర విగతజీవిగా మంచంపై పడి ఉండగా, రాజకుమారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 12, 2025
రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361011801_746-normal-WIFI.webp)
ప్రతిరోజూ 10వేల అడుగులు వేయడం వీలుకాని వారు కనీసం ఆపకుండా 30 నిమిషాలు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ‘అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అకాల మరణం నుంచి తక్కువ ప్రమాదం ఉంటుంది’ అని తెలిపారు. అయితే, నెమ్మదిగా నడవొద్దని, కాలక్రమేణా వేగాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇది శరీర జీవక్రియ, శ్వాసకోశ, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
News February 12, 2025
నిర్లక్ష్యం వహిస్తే సహించబోను: ప్రకాశం కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739364025563_20611727-normal-WIFI.webp)
బాలలకు ఆధార్ కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిబిరాల తీరు, పురోగతిపై సమక్షించారు. పనితీరు పేలవంగా ఉన్న సిబ్బందికి షోకజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు తెలిపారు.
News February 12, 2025
కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయి: మాజీ మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362984589_653-normal-WIFI.webp)
TG: తెలంగాణ, ఏపీని మద్యం మాఫియా నడిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు రాష్ట్రాలు ఒప్పందంతో నడుస్తూ ఒకేసారి మద్యం ధరలు పెంచాయని అన్నారు. కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయని తెలిపారు. ధరలు ఎవరు పెంచుతున్నారో తమకు తెలుసని, త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.